Monday, December 23, 2024

తమిళనాడులో వృద్ధుడ్ని తొక్కి చంపిన ఏనుగు

- Advertisement -
- Advertisement -

ఎరోడ్ (తమిళనాడు): సత్యమంగళం టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో మంగళ వారం ఉదయం 74 ఏళ్ల వృద్ధుడు మథియాను ఏనుగు తొక్కి చంపింది. ఈ అడవిలో తలవాడి ఫారెస్ట్ రేంజిలో ఈ సంఘటన జరిగింది. గీరహల్లి ఏరియాకు చెందిన మథియా ఓ ప్రైవేట్ భూముల్లోని పంటలకు కాపలా దారుగా పనిచేస్తున్నాడు.

సోమవారం రాత్రి ఆ భూముల్లోని పంటలను జంతుబారి నుంచి రక్షించుకోడానికి వెళ్లగా మంగళవారం తెల్లవారు జామున ఏనుగు పొలాల్లోకి ప్రవేశించడం గమనించి భయపెట్టడానికి క్రాకర్లు పేల్చాడు. అయినాసరే ఆ పేలుళ్లకు ఏనుగు ఏమాత్రం బెదరకుండా మథియాపై పగతో వెంటాడి తొక్కి చంపేసింది. మథియా కేకలు విని సమీపాన ఉన్న స్థానికులు ఆ స్థలానికి వెళ్లగా మథియా అప్పటికే చనిపోయి కనిపించాడు. అటవీ అధికారులకు వెంటనే ఈ విషయం తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News