Monday, January 20, 2025

బడ్జెట్‌లో రైతులకు, నిరుద్యోగులకు నిరాశే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రైతులకు, నిరుద్యోగులకు మొండి చెయ్యి ఇచ్చిన కాంగ్రెస్ బడ్జెట్ ముమ్మాటికీ హామీల ఎగవేత బడ్జెట్ అని బిజెపి శాసన సభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కనిపించడం లేదని, వాస్తవాలకు దూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచింది, ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపిందన్నారు. ప్రభుత్వం రైతులను మోసం చేసింది, వ్యవసాయ రంగానికి కేవలం రూ.19,746 కోట్ల మాత్రమే కేటాయించారు, ఏడాదికి రూ. 15వేల రైతు భరోసా, చేస్తామన్న 2 లక్షల రుణమాపీ, 24 గంటల ఉచిత కరెంట్, పంటల బీమా, పంటలకు రూ. 500 బోనస్ అన్నింటికి ఈ నిధులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.

మీరు చెప్పిన హామీలు, గ్యారంటీలు బారెడు ఉన్నాయని, కేటాయించిన నిధలు మూరెడు ఉన్నాయని, గత ప్రభుత్వంపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలనే మరోసారి చెప్పించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పే ప్రయత్నంపైనే ఫోకస్ చేశారు తప్ప అభివృద్ధి నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500 ఇస్తామని ప్రకటించి, ఇంటికి రూ. 5లక్షల చొప్పున ఇస్తే రూ. 20వేల కోట్లు బడ్జెట్ ఇవ్వాలి, కాని కేవలం రూ. 7,740 కోట్ల మాత్రమే కేటాయించారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు పసల్ బీమా, పిఎం మిత్ర లాంటి పథకాలను బడ్జెట్ లో ప్రస్తావించడం సంతోషమని, రాష్ట్ర అభివృద్ది విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తేవడంలో మా వంతుగా కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ కెసిఆర్ సర్కారు చేసిన తప్పులనే చేస్తోందన్నారు.

రూ. 60 వేల కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్ గ్యాలెస్ e నోట్ లో పేర్కొందని, తెలంగాణ పరిస్థితి పెనం నుంచి జారి పొయ్యిలో పడినట్లు అయిందన్నారు.ఆరు గ్యారంటీలకు రూ. 53,196 కోట్లు కేటాయించారని, ఇందులో సగానికి పైగా పెన్షన్ల స్కీం చేయూతకే ఖర్చు అవుతుందన్నారు. మిగిలిన సగం ఇందిరమ్మ ఇళ్లకు ఖర్చవుతుంది. మరి రైతు భరోసా ఎకరానికి రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్, మహిళలకు ప్రతి నెలకు రూ. 2,500 ఇవ్వాల్సిన మహాలక్ష్మి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలిన గృహ జ్యోతి పధకం, రూ. 500కే గ్యాస్ సిలిండర్ల వంటి స్కీంలకు నిధుల జాడలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News