Monday, December 23, 2024

హైదరాబాద్‌కు మరో ఎలివేటేడ్ కారిడార్

- Advertisement -
- Advertisement -

ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి, డెయిరీ ఫామ్‌ రోడ్ వరకు నిర్మించే ఎలివేటేడ్ డబుల్ కారిడార్ నిర్మాణానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కండ్లకోయ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 5.3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణం కానుంది. 131 స్తంభాలతో 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ ను ప్రభుత్వం నిర్మించనుంది.

రెండో దశలో మెట్రో రైల్ మార్గం పనులను ప్రారంభించనున్నారు. రూ. 1580 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారి-44 మార్గానికి మహర్దశ రానుంది. కారిడార్ వల్ల సికింద్రాబాద్‌ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడుతుంది. 4.66 కి.మీ ఎలివేటెడ్ కారిడార్, 0.6 కి.మీ అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News