Monday, December 23, 2024

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ లో విషాదం..11 మంది అభ్యర్థులు మృతి

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్‌లో నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఫిజికల్ టెస్ట్‌లో పాల్గొన్న అభ్యర్థుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీస్‌లు ఆదివారం వెల్లడించారు. ఆగస్టు 22న మొత్తం ఏడు సెంటర్లలో ఫిజికల్ టెస్ట్‌లు ప్రారంభమయ్యాయి. పాలములో నలుగురు, గిరిధ్, హజారీబాగ్‌ల్లో ఇద్దరు, రాంచీ లోని జాగ్వార్ సెంటర్‌లో ఒకరు, ఈస్ట్ సింగ్భూమ్ లోని మోసబని, సాహెబ్‌గంజ్ సెంటర్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్టు ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకర్ వెల్లడించారు. వీటిని అసహజ మరణాలుగా పేర్కొంటూ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News