Wednesday, January 22, 2025

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి..11మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గేమింగ్ హౌస్‌పై బుధవారం దాడి చేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పదకొండు మందిని అరెస్టు చేశారు. సునీల్ అనే వ్యక్తి ట్రీకార్డ్ గేమింగ్ నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్నవారిని ఆడేందుకు ఆహ్వానిస్తున్నాడు. పేకాడుతున్న వారి వద్ద నుంచి కమీషన్ తీసుకుంటున్నాడు.

పేకాడుతున్న 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 1,69,080 రూపాయలు, పదిమొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం వారిని ఛత్రీనాక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News