Monday, March 31, 2025

పెద్దపల్లిలో కూతురిని ప్రేమించాడని… యువకుడిని గొడ్డలితో నరికి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. కూతురుని ప్రేమించాడని ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం….  ముప్పిరితోట గ్రామంలో పూరెల్ల సాయి కుమార్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో సాయి కుమార్‌ను హెచ్చరించాడు. ఐనా కూడా సాయి కుమార్ సదరు యువతితో మాట్లాడుతుండడంతో ఆమె తండ్రి కోపంతో రగిలిపోయాడు.

గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి శ్రీ వెంకటేశ్వర దేవాలయం వెనుక కూర్చొని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకొని సాయిపై విచాక్షణ రహితంగా దాడి చేశాడు. మిగితా స్నేహితులు పారిపోయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సాయిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి కుమార్ చనిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ముప్పిరితోట గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News