Wednesday, April 2, 2025

అర్హులను ఓటరుగా నమోదు చేయాలి

- Advertisement -
- Advertisement -

ఊట్కూర్ : బిఎల్‌ఓలు ఇంటి ంటి సర్వేలో 18 ఏళ్ల పై బడిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహ ర్ష ఆదేశించారు. శనివారం మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఊట్కూరులో బూత్ స్థాయి అధికారుల శిక్షణ సమావేశం ఏర్పాటు చేసి బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటిలో 18 ఏళ్ల నుండి 20 లోపు గల వారిని ఫారం 6 ద్వారా నమోదు చేసి అప్లోడ్ చేయాలన్నారు.

అనంతర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈఆర్‌ఓ లాగిన్ ద్వారా ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. హాస్టల్‌లో వంట గది మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ పరిశీలించి హాస్టల్ నిర్వహణకులకు సూచనలు చేశారు. ఈ కార్యాలయంలో తహసీల్దార్ , సిబ్బంది తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News