Wednesday, January 22, 2025

అర్హతగల ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియూఎస్) డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్‌జిటి నుండి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్2 పాస్ కావాలని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చిన సందర్భంలో 2010 ఆగస్టు 23 తరువాత నియామకానికి మాత్రమే టెట్1 (ఎస్‌జిటిలకు ), టెట్ 2 స్కూల్ అసిస్టెంట్లకు తప్పనిసరి అని ఉందని, కానీ 2010 ఆగస్టు 23 కన్నా ముందు నియామకం వారు పదోన్నతి పొందడానికి నిబంధన ( టెట్ 2 ) ఎక్కడ స్పష్టంగా లేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత రావు, ప్రధాన కార్యదర్శి యన్. సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కోర్టుకు సరియైన ధృవ పత్రాలు, సమాచారం ఇచ్చి కోర్టు అనుమతి తీసుకుని సీనియారిటీ ప్రకారమే అర్హతగల ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News