Tuesday, December 24, 2024

జూబ్లీహిల్స్‌లో నకిలీ ఓట్లు తొలగించండి : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పలు డివిజన్లతో తప్పుడు వివరాలతో నమోదు చేసుకున్న నకిలీ ఓట్లును తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు కోరారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ ను కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదు చేసుకున్న నకిలీ ఓటర్ల జాబితాను బిజెపి నేతల బృందం అందజేసింది. అనంతరం గౌతమ్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు బూత్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను పరిశీలించగా.. తప్పుడు వివరాలతో నమోదు చేసుకొన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పూర్తి వివరాలతో ఎన్నికల అధికారులకు అందజేశామని వెల్లడించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిజెపి నేతలు గంగరాజు, దీపక్‌రెడ్డి, కొలన్ సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News