Monday, December 23, 2024

స్వియాటెక్ ఇంటికి ఇగాకు స్విటోలినా షాక్

- Advertisement -
- Advertisement -

లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. టాప్ సీడ్, టైటిల్ ఫేవరెట్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉక్రెయిన్ క్రీడాకారిణ ఎలినా స్విటోలినా హోరాహోరీ సమరంలో స్వియాటెక్‌ను మట్టికరిపించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో స్విటోలినా 77, 67, 62 తేడాతో ఇగాను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది.

ఇటు స్వియాటెక్ అటు స్విటోలినా ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. టైబ్రేకర్ వరకు సాగిన తొలి సెట్‌లో ఇగాకు చుక్కెదురైంది. రెండో సెట్‌లో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లింది. అయితే ఇందులో స్వియాటెక్ పైచేయి సాధించింది. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం మళ్లీ స్విటోలినా ఆధిపత్యం చెలాయించింది. ఇగాను హడలెత్తిస్తూ అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

మరోవైపు నాలుగో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) కూడా క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ మార్కెటా వొండ్రొసొవాతో జరిగిన మూడు సెట్ల సమరంలో పెగులా 46, 62, 46తో పరాజయం చవిచూసింది. ఇదిలావుంటే పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News