Tuesday, March 4, 2025

కనుల పండుగగా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: అబిడ్స్‌లోని నేతాజీనగర్ కాలనీలో మంగళవారం శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ దేవీ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగి ంది. మాల సంఘం నాయకుడు సాంబశివరావు, హేమతల స్వగృహంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమి తి రాష్ట్ర కార్యదర్శి ఎం వినోద్‌కుమార్ ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఛైర్మెన్ చెరుకు రాంచందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లమ్మ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, నేతాజీ నగర్ కాలనీ మాజీ అధ్యక్షులు ఎం వినోద్‌కుమార్, నగర ఉపాధ్యక్షులు మద్దల ప్రభాకర్‌లు ముఖ్యఅతిథిగా హాజరైన మాలల జేఏసీ ఛైర్మెన్ చెరుకు రాంచం దర్‌ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అరుందతి, సుమిత్ర, రేఖ, వరలక్ష్మి, చంద్రకళలతో పాటు కాలనీ వాసు లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News