ఇల్లందు : సోషలిస్టు సమాజ నిర్మాణమే ధ్యేయంగా అసమానతలు లేని నవసమాజ స్ధాపనకు బాటలు వేసిన ఎల్లన్న అమరత్వాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించాలని సిపిఐ ఎమ్‌ఎల్ ప్రజా పంథా రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణలు అన్నారు.
ఈ సందర్భంగా వారు శుక్రవారం స్థానిక ఎల్లన్న విజ్ఞానభవన్‌లో నిర్వహించిన ఎల్లన్న 27వ వర్ధంతి సభలో పాల్గోని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. 1996 జూన్ 26న లాడాయిగడ్డ వద్ద జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో కొత్తగూడెం డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్న సాయుధ దళపతి చండ్ర కృష్ణమూర్తి అలియాస్ ఎల్లన్న అమరుడైనాడన్నారు. ప్రజల కష్టాలు వారి సమస్యలలో పాలుపంచుకోని పరిష్కరించి బాసటగా నిలిచేవరన్నారు.
ఉద్యమంలో పనిచేసే ప్రతిఒక్కరు విజ్ఞానాన్ని పెంపోందించుకోవాలని ఆదిశగా కృషి చేసేవాడన్నారు. ఎల్లన్న మరణం పేదప్రజలకు తీరనిలోటని ఆయన ఎత్తిన జెండాను ప్రజలు ఇనాటికి మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్‌ఎల్ ప్రజా పంథా రాష్ట్ర, జిల్లా నాయకులు రాయల చంద్రశేఖర్, చిన్న చంద్రన్న, కెచ్చల రంగయ్య, నాయిని రాజు, బోస్, యాకుబ్‌షావళి, కాంపాటి పృధ్వి, బుర్ర వెంకన్న, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.