Sunday, December 22, 2024

11వ సంతానానికి తండ్రయిన ఎలాన్ మస్క్

- Advertisement -
- Advertisement -

టెక్ కుబేరుడు ఎలాన్ మస్క్ 11వ ంతానానికి తండ్రయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మస్క్ భార్య షివాన్ జిలీస్ మూడవ బిడ్డకు జన్మనిచ్చారు. మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌లో ఆపరేషన్స్, స్పెషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా జిలీస్ వ్యవహరిస్తున్నారు. ఈ దంపతులకు 2021లో కవలలు జన్మించారు. ఎలాన్ మస్క్ మొదటి భార్య జస్టిస్ మస్క్‌కు ఐదుగురు సంతానం కాగా రెండవ భార్య కెనడా సంగీత కళాకారిణి గ్రైమ్స్‌కు ముగ్గురు పల్లిలు. మూడవ భార్య జిలీస్ ద్వారా మస్క్‌కు ముగ్గురు పిల్లలు జన్మించారు.

దీంతో మొత్తం 11 మంది సంతానానికి ఎలాన్ మస్క్ తండ్రయ్యారు. 2022 ముందు వరకు మస్క్, జిలీస్ మధ్య సంబంధం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే తమ కవల పిల్ల పేర్లను మార్చడానికి పెట్టుకున్న దరఖాస్తుతో ఈ విషయం బయటపడింది.మస్క్ ఆత్మకథ రాస్తున్న వాల్టర్ జాక్సన్ 2023 సెప్టెంబర్‌లో మస్క్, జిలీస్ మధ్య అనుబంధాన్ని వెల్లడించారు.తమ కవల పిల్లలతో ఉన్న మస్క్, జిలీస్ ఫోటోను ఆయన సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News