Wednesday, April 9, 2025

ట్రంప్ క్యాబినెట్ మీటింగ్.. మస్క్, రూబియోల మధ్య వాగ్వాదం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆదేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో , ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ గొడవ పడినట్టు తెలుస్తోంది. ఈమేరకు పలు వార్తా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ శాఖను ట్రంప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వవిభాగాల్లో వృధా ఖర్చులను తగ్గించడానికి , ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్షంగా భారీగా ఉద్యోగులను ఈ శాఖ తొలగిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమర్శలపై చర్చించేందుకు ట్రంప్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అందులో డోజ్ బాథ్యతలు నిర్వహిస్తున్న మస్క్, విదేశాంగ మంత్రి రూబియోలు సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో మస్క్ మాట్లాడుతూ రూబియో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని, తాను మాత్రం పనిచేయనివారిని తొలగిస్తున్నానన్నారు. దీనిపై రూబియో మాట్లాడుతూ “ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు ముందే పదవీ విరమణ చేశారు. నేను తొలగించాలంటే వారిని మళ్లీ విధుల్లోకి తీసుకొని తొలగించాల్సి వస్తుంది. ” అని వ్యంగ్యంగా సమాధానమిచ్చినట్టు సమాచారం.
స్పందించిన ట్రంప్
ఈ కథనాలపై ఓవల్ ఆఫీసులో జరిగిన విలేఖరుల సమావేశంలో ట్రంప్ స్పందించారు. ‘ ఘర్షణ లాంటిది ఏం లేదు. నేను అక్కడే ఉన్నా. మస్క్ రూబియోతో కలిసిపోయాడు. వారిద్దరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. ’ అని ట్రంప్ బదులిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News