Saturday, December 21, 2024

ట్రంప్ కార్యవర్గంలో మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్షునిగా విజయం సాధించిన ట్రంప్ బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. “ ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన , మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ‘సేవ్ అమెరికా 2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు” అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్‌జాన్ రాట్‌క్లిఫ్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్‌లందరి రాజ్యాంగ హక్కుల కోసం నిర్భయమైన పోరాట యోధుడిగా రాట్‌క్లిఫ్ నిలుస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. అర్కాస్నాస్ మాజీ గవర్నర్ మైక్‌హుక్ అబీని ఇజ్రాయెల్ రాయబారిగా ఎంపిక చేశారు. రక్షణశాఖ కార్యదర్శి బాధ్యతలను ఫ్యాక్స్ న్యూస్‌లో హోస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పీట్‌హెగ్సెత్‌కు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News