Monday, November 18, 2024

గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసేస్తా

- Advertisement -
- Advertisement -

Elon Musk announces closure of Tesla cars if found guilty of spying

 

టెస్లా అధినేత మస్క్

వాషింగ్టన్: టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. టెస్లాకార్లు గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారని చైనా మిలిటరీ అనుమానిస్తోంది. దీంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.చైనా ప్రభుత్వం తమ దేశంలో మిలిటరీ వాడుతున్న టెస్లా కార్లను పూర్తిగా నిషేధించింది. అయితే ఒక వేళ టెస్లాకార్లు చైనాలో కాని, వేరే దేశాల్లో కాని గూఢచర్యానికి పాల్పడినట్లయితే కంపెనీని మూసి వేస్తానని మస్క్ చైనాకు చెందిన ప్రముఖ కంపెనీతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తెలిపారు.

ప్రముఖ మీడియా సంస్థల కథనాల ప్రకారం చైనా రక్షణ దళం భద్రతా కారణాల రీత్యా సైనిక సముదాయాల్లోకి టెస్లాకార్లు రాకుండా నిషేధించినట్లు తెలుస్తోంది. టెసా ్లకార్లకున్న కెమెరాలతో తమ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోందని చైనా రక్షణ దళం భావిస్తోందని ఆ వార్తలు పేర్కొన్నాయి. అలాస్కాలో అమెరికా, చైనా దౌత్యవేత్తల మధ్య సమావేశం తర్వాత ఈ నిషేధాజ్ఞలు వెలువడ్డాయి. జనవరిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి భేటీ ఇది కావడం గమనార్హం. గత ఏడాది చైనాలో టెస్లా 1,47,445 కార్లను విక్రయించగా ఈ ఏడాది చైనా కంపెనీ నియోనుంచి టెస్లా గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News