Thursday, January 23, 2025

ట్విట్టర్‌లో 9.2% వాటా కొన్న మస్క్

- Advertisement -
- Advertisement -

Elon Musk bought a 9.2 percent stake in Twitter

న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత సంపన్నుడు, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం ట్విట్టర్ ఈ సమాచారాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇచ్చింది. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఎలోన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను, అంటే 73,486,938 షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ట్విట్టర్ స్టాక్ భారీగా 25.53 శాతం పెరిగి 49.34 డాలర్ల వద్ద ట్రేడయింది. ఎలోన్ మస్క్ సొంతంగా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండగా, ఆయన నికర విలువ 273 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన తర్వాతి స్థానంలో అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ (188 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News