Monday, December 23, 2024

ఎలోన్ మస్క్ చేతికి ట్విట్టర్

- Advertisement -
- Advertisement -

Twitter in the hands of Elon Musk

44 బిలియన్ డాలర్ల డీల్‌కు ఆమోదం
ప్రైవేటు కంపెనీగా మారనున్న సోషల్ మీడియా

న్యూయార్క్ : టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు ట్విట్టర్‌కు ఆయన కొత్త యజమాని అయ్యారు. ఈ సోషల్ మీడియా సైట్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ 44 బిలియన్ డాలర్ల (రూ.3.36 లక్షల కోట్లు) డీల్‌కు ఆమోదం చెప్పారు. ట్విట్టర్ స్వతంత్ర బోర్డు చైర్మన్ బ్రెట్ టేలర్ మస్క్‌తో ఒప్పందం గురించి సమాచారం ఇచ్చారు. మస్క్ ట్విటర్ ప్రతి షేరుకు 54.20 డాలర్లు (రూ.4,148) చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్‌లో ఇప్పటికే 9.2 శాతం వాటాతో ఆయన అత్యధిక షేర్ హోల్డర్‌గా ఉన్నారు. తాజా ఒప్పందం తర్వాత ఆయనకి కంపెనీలో 100 శాతం వాటా ఉంటుంది. ట్విట్టర్ ఆయన ప్రైవేట్ కంపెనీ అవుతుంది. ట్విట్టర్‌ని కొనుగోలు చేసేందుకు 46.5 బిలియన్ డాలర్లు నిధులు సమకూర్చినట్లు మస్క్ గత వారం తెలిపారు. దీని తర్వాత మస్క్ ఆఫర్‌పై ట్విట్టర్ బోర్డు తాజాగా పరిశీలించింది.

ఆదివారం ట్విట్టర్ బోర్డు మస్క్ ఆఫర్‌పై చర్చించింది. సోమవారం సాయంత్రం ట్విట్టర్‌ని అన్‌లాక్ చేయాలని మస్క్ అన్నారు. మస్క్ ఆఫర్‌ను ట్విట్టర్ బోర్డు అంగీకరించినట్లు తెలిసింది. కొనుగోలు ఒప్పందం ఖరారైన తర్వాత మస్క్ వాక్ స్వాతంత్య్రం కోసం వాదిస్తూ ట్వీట్ చేశారు. ఒప్పందానికి ముందు, మస్క్ ఇలా ట్వీట్ చేశాడు: ‘నా చెత్త విమర్శకులు ట్విట్టర్‌లో ఉంటారని ఆశిస్తున్నాను, ఎందుకంటే స్వేచ్ఛా ప్రసంగం అంటే అదే’ అని అన్నారు. ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా 217 మిలియన్ల వినియోగదారులను కలిగివుంది. దీనిలో 77 మిలియన్లతో అత్యధికంగా అమెరికాలో ఉన్నారు. రెండో స్థానంలో 58 మిలియన్లతో జపాన్, 24 మిలియన్ల వినియోగదారులతో మూడవ స్థానంలో భారత్ ఉంది.

సిఇఒ పరాగ్‌ను తొలిగిస్తారనే ఉహాగానాలు

భారత సంతితికి చెందిన ట్విట్టర్ సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పరాగ్ అగర్వాల్‌పై ఇప్పుడు వేటు పడనుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. అదే సమయంలో సోషల్ మీడియా సైట్‌లోనూ పరాగ్‌పై మీమ్స్ వస్తున్నాయి. అయితే బాధ్యతలు చేపట్టి అందువల్ల 12 నెలల లోపు తొలగించినట్లయితే పరాగ్‌కు 42 మిలియన్ డాలర్లు అంటే రూ.321 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బిలియనీర్, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. 2013 నుంచి ఇది పబ్లిక్ కంపెనీగా నడుస్తోంది. ట్విట్టర్ యాజమాన్యంపై తనకు నమ్మకం లేదంటూ ఏప్రిల్ 14న మస్క్ సెక్యూరిటీస్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం చూస్తే బోర్డులో మార్పులు చేపట్టే అవకాశముంది.

ట్విట్టర్ భవిష్యత్తుపై ఆందోళన

ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీ సిఇఒ పరాగ్ భవిష్యత్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. మస్క్ నాయకత్వంలో ట్విట్టర్ భవిష్యత్తు అంధకారంలో ఉందని పరాగ్ ట్విట్టర్ విక్రయం తర్వాత ఉద్యోగులతో అన్నారు. కంపెనీ ఇప్పుడు ఏ దిశలో వెళుతుందో ఎవరికీ తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. పరాగ్‌ని తొలగిస్తే 2021 నవంబర్‌లో ట్విట్టర్ సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు రూ.321 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.నివేదిక ప్రకారం, పరాగ్‌ను 12 నెలల ముందు పదవి నుండి తొలగిస్తే కంపెనీ ఆయనకు 42 మిలియన్ డాలర్లు (రూ.321 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు కంపెనీలో పరాగ్ సిఇఒ పదవికి వచ్చి కేవలం 5 నెలలే అవుతోంది. నవంబర్‌లో జాక్ డోర్సే రాజీనామా చేయడంతో ఆయన సిఇఒగా నియమితులయ్యాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News