Wednesday, January 22, 2025

పక్షి పోయి శునకం వచ్చే..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంస్థలో ఉద్యోగులను తొలగించడంతో పాటు అనేక మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ట్విట్టర్ లోగోనే ట్విట్టర్‌లో ముందు నుంచి కనిపించే బ్లూ బర్డ్ ఇకపై కనిపించబోదు. నీలి రంగు పక్షి స్థానంలో ఇప్పుడు శునకం బొమ్మ కనిపిస్తోంది. ట్విటర్ లోగో మార్చిన తర్వాత ఈ శునకం ఎలోన్ మస్క్ శునకం అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇంతకు ముందు కూడా ఎలాన్ మస్క్ ఈ శునకం బొమ్మను చూపి ఇదే సిఇఒ అంటూ ప్రకటన చేశాడు. ట్విట్టర్‌లో కనిపించేది ఎలోన్ మస్క్ పెంపుడు శునకం ఫ్లోకి షిబా ఇను అని అంతా భావిస్తున్నారు. ఎలోన్ మస్క్ తన శునకం చిత్రాలను చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎలోన్ మస్క్ తన శునకం ఫ్లోకి పాత ఉద్యోగుల కంటే మెరుగైనదని అన్నాడు. గతంలోనూ మస్క్ డోజికాయిన్‌ని ప్రచారం చేస్తూనే ఉన్నాడు, దీనిని మెమెకాయిన్ అని కూడా అంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News