Sunday, January 19, 2025

ట్విట్టర్ ఆదాయం ఢమాల్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ట్విట్టర్ ఆదాయం సగానికి పడిపోయిందని ఎలాన్ మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ యజమాని అయిన ఎలాన్ మస్క్ కంపెనీ ఆదాయం పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. తాజాగా కంపెనీలో నగదు కొరత పెరిగిందని, వాణిజ్య ప్రకటనల ఆదాయం సగానికి పడిపోయిందని మస్క్ ట్వీట్ చేశారు. ఒక వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు మస్క్ ట్విట్టర్‌లో ఈ విధంగా సమాధానమిచ్చారు.

కంపెనీ నగదు లోటు నుంచి మిగులుకు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఈ ఏడాది 4.5 బిలియన్ డాలర్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా, అంచనాలను అందుకోలేదు. కేవలం 3 బిలియన్ డాలర్లు మాత్రమే వస్తుందని భావిస్తున్నారు. 2021లో 5.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. గతేడాది ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ సంస్థలో అనేక మార్పులు చేశారు. ట్విట్టర్‌లో ఉద్యోగాల కోతతో పాటు ప్లాట్‌ఫామ్‌లో సబ్‌స్క్రిప్షన్ వంటి మార్పులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News