Wednesday, December 25, 2024

మోడీకి ఎలన్ మస్క్ అభినందన

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పది కోట్ల మందికి పైగా ఫాలోయర్లతో సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న నేతగా అవతరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీని టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ అభినందించారు. ‘అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న ప్రపంచ నేత అయినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు’ అని ఎక్స్ కార్పొరేషన్ యజమాని మస్క్ శుక్రవారం ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీకి ఎక్స్‌లో 10.01 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ వారారంభంలో ఈ మైలురాయి చేరుకున్నప్పుడు ‘ఎక్స్‌లో వంద మిలియన్లు.

చైతన్యవంతమైన ఈ మాధ్యమంలో ఉన్నందుకు ఆనందంగా ఉంది. చర్చ, ఆలోచనలు, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు వంటివి ప్రోత్సాహకరం’ అని మోడీ పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో మరింత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నా’ అని మోడీ తెలిపారు. అధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న ఇతర ప్రపంచ నేతల్లో యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ (3.81 కోట్ల మంది), తుర్కియే నేత రిసెప్ తయ్యిప్ ఎర్దొగాన్ (2.15 కోట్ల మంది) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News