Tuesday, January 21, 2025

ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎలన్ మస్క్

- Advertisement -
- Advertisement -

టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. గత రెండు నెలల్లో టెస్లాలో ఆయన వ్యక్తిగత సంపద భారీగా తగ్గిపోయింది. మస్క్ వ్యక్తిగత సంపద సుమారు రూ.3 లక్షల కోట్ల పై చిలుకు (40 బిలియన్ డాలర్లు) ఆవిరైంది.దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ మస్క్ మూడో స్థానానికి పడిపోయారని బ్లూంబర్గ్ తెలిపింది. బ్లూంబర్గ్ డేటా ప్రకారం ప్రస్తుతం ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 189 బిలియన్ డాలర్లు. ఫ్రాన్స్ వ్యాపార వేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఎలన్ మస్క్ తర్వాత 182 బిలియన్ డాలర్లతో సోషల్ మీడియా దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే మార్క్ జుకర్ బర్గ్ వ్యక్తిగత సంపద ఏకంగా 53 శాతం పెరిగింది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లే ఎలన్ మస్క్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. చైనాలో కంపెనీ విక్రయాలు ఆశాజనకంగా లేకపోవడంతోపాటు బెర్లిన్ సమీపంలోని కంపెనీ ఫ్యాక్టరీపై దాడి జరగడంతో కార్ల ఉత్పత్తిని నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రెండు నెలల్లో టెస్లా షేర్లు 29 శాతం పతనం అయ్యాయి. 2021 నాటి గరిష్ట విలువతో పోలిస్తే 50 శాతానికి పైగా టెస్లా షేర్ విలువ నష్టపోయింది. దీనికి తోడు టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఎలన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు తీర్పు చెప్పడం కూడా ఆయన సంపద తగ్గడానికి మరో కారణం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News