Monday, December 23, 2024

పెంపుడు కూతురుతో బిడ్డను కన్న ఎలన్ మస్క్ తండ్రి

- Advertisement -
- Advertisement -

Elon Musk father had second child with stepdaughter

తగ్గుతున్న జనాభాకు మేలుచేసేందుకేనని వ్యాఖ్యలు

వాషింగ్టన్ : టెస్లా సిఇఒ ఎలన్ మస్క్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతేకాదు మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఎర్రోల్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం బ్రిటన్‌కు చెందిన టాబ్లాయిడ్ ఎర్రోల్ మస్క్‌ను తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తగ్గిపోతున్న జనాభాకు మేలు చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మస్క్ తల్లి మేయల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి అప్పటికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్, జానా దంపతులు అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చారు. రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్ నడుమ వయసు వ్యత్యాసం 40 సంవత్సరాలు కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News