Sunday, December 22, 2024

చైనాకు ఎలాన్ మస్క్

- Advertisement -
- Advertisement -

బీజింగ్:  టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాకు వెళ్లారు. వాస్తవానికి ఈ సమయంలో మస్క్ ఇండియా పర్యటనకు రావాలని గతేడాది నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే, చివరి క్షణంలో ఈ పర్యటనను ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్నారు. భారత పర్యటనను మస్క్ రద్దు చేసుకోవడం, అదే సమయంలో చైనాకు సర్ ప్రైజ్ విజిట్ చేయడంపై బిజినెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. మస్క్ చైనా పర్యటనపై స్పందించేందుకు టెస్లా వర్గాలు నిరాకరించనట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. మస్క్ చైనా పర్యటన వివరాలు కూడా అనధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది.

టెస్లా వాహనాలకు అమెరికా, చైనాలే అతిపెద్ద మార్కెట్.. టెస్లాకు పోటీగా చైనాలో క్సిపెంగ్ అనే కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో చైనాలో టెస్లాకు గట్టి పోటీనిస్తోంది. అమెరికాలో నాలుగేళ్ల క్రితమే పూర్తిస్థాయి ఆటో పైలట్ వ్యవస్థతో టెస్లా కంపెనీ తయారు చేసిన ఎఫ్ఎస్ డి కారుకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కారును తమకూ అందుబాటులోకి తీసుకురావాలని చైనా ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని మస్క్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఎఫ్ఎస్ డి కారును చైనా మార్కెట్లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News