Sunday, November 17, 2024

ఆమె ‘హీనమైన నకిలీ అభ్యర్థి’

- Advertisement -
- Advertisement -

యుఎస్ డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘హీనమైన నకిలీ అభ్యర్థి’ అని, తన బాస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను ‘మించి అసమర్థురాలు’ అని నవంబర్ ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బిలియనీర్ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌తో ‘ఎక్స్’లో ఆడియో ఇంటర్వూలో 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, ‘ఆమె రాడికల్ లెఫ్ట్ వెర్రిది’ అని వ్యాఖ్యానించారు. ‘ఆమె ట్రంప్‌ను మించి ట్రంప్‌ను కావాలని వాంఛిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. సాంకేతిక కారణాలతో 40 నిమిషాల కన్నా ఆలస్యంగా ఆడియో ఇంటర్వూ విడుదల అయింది. 59 ఏళ్ల యుఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆమెను ‘హీనమైన నకిలీ అభ్యర్థి’గా అభివర్ణించారు. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ స్థానంలో హారిస్‌ను ప్రకటించడం ఒక తిరుగుబాటు అన్న తన ఆరోపణను ట్రంప్ పునరుద్ఘాటించారు. మాజీ అధ్యక్షుని అభిప్రాయంతో మస్క్ ఏకీభవిస్తూ, ‘ఆమె ప్రవర్తన తీవ్ర వామపక్షవాదిగా ఉంటుంది’ అని అన్నారు.

‘ఆమె (హారిస్)కు మూడున్నర సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. వారు ఏమైనా చేయదలచుకుంటే మరి ఐదు నెలలు ఉన్నాయి. కానీ వారు ఏమీ చేయబోరు. మాటలే ఉంటాయి’ అని ట్రంప్ అన్నారు. ‘ఆమె అసమర్థురాలు. ఆయన (బైడెన్) అసమర్ధుడు. కరాఖండిగా చెప్పాలంటే ఆమె ఆయనను మించిన అసమర్థురాలని నా భావన. ఆయన అంత గొప్ప మనిషి కానందున ఆవిధంగా అంటున్నాను’ అని ట్రంప్ చెప్పారు. నవంబర్ 5 నాటి సార్వత్రిక ఎన్నికల్లో హారిస్‌ను ట్రంప్ ఢీకొంటారు. వందలు వేల సంఖ్యలో ప్రజలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందున హారిస్ సరిహద్దు భద్రత విషయమై ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. తాను చట్టబద్ధమైన వలసలకు అనుకూలుడినని ట్రంప్ ఉద్ఘాటిస్తూ, అక్రమ వలసలకే వ్యతిరేకినని చెప్పారు. తానుస సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లోకి తిరిగివచ్చినప్పుడు ‘ఆమె అబద్ధాల కోరు’ అని ఆరోపించారు. ఆడియోగా మాత్రమే ఉన్న వారి సంభాషణను పది లక్షల మందికి పైగా విన్నారు. ‘ఎక్స్‌లో భారీ డిడిఒఎస్ (పంచుకున్న సేవ నిరాకరణ) దాడి ఉన్నట్లు కనిపిస్తోంది. దాని మూసివేతకు ప్రయత్నిస్తున్నా.

మరీ దారుణంగా ఉంటే స్వల్ప సంఖ్యలో శ్రోతలతో ముందుకు సాగి, సంభాషణను ఆ తరువాత పోస్ట్ చేస్తాం’ అని మస్క్ ‘ఎక్స్’లో అన్నారు. బైడెన్, హారిస్ ప్రభుత్వ సార్వత్రిక సరిహద్దు విధానం కారణంగా యుఎస్‌లో నేరాల రేటు పెరిగిందని ఇంటర్వూలో మస్క్, ట్రంప్ ఇద్దరూ అంగీకరించారు. ‘ఈ దేశ చరిత్రలో అతి పెద్ద సంఖ్యలో వలసకారులను తిప్పిపంపే ప్రక్రియను చేపట్టబోతున్నాం. మాకు మరొక మార్గం లేదు’ అని మాజీ అధ్యక్షడు చెప్పారు. మస్క్ అడిగిన ఒక ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ, బైడెన్ విదేశాంగ విధానం దారుణంగా ఉందని దుయ్యబట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను ట్రంప్ కొనియాడారు. ‘వారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడుగా ఉంటే యుద్ధం ఉండదని ట్రంప్ చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, దేశంలో 100 ఏళ్లలో అధ్వాన స్థాయిలో ద్రవ్యోల్బణం ఉందని అన్నారు.

బైడెన్, హారిస్ ప్రభుత్వంయుఎస్ ఆర్థిక వ్యవస్థను అధ్వానం చేసిందని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్, మస్క్ మధ్య సంభాషణ జూలై 13నాటి పెన్సిల్వేనియా బట్లర్‌లో మాజీ అధ్యక్షునిపై హత్యా యత్నంతో మొదలైంది. ‘అది భగవంతుని క్రియ అని అంటా. అది జరగడం అద్భుతం’ అని ట్రంప్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News