Monday, December 23, 2024

ట్విట్టర్ ఓనర్‌గా మస్క్

- Advertisement -
- Advertisement -

Elon Musk is now Twitter boss

44 బిలియన్ డాలర్ల డీల్ పూర్తి
కంపెనీ నుంచి సిఇఒ పరాగ్, విజయ్ గద్దె ఔట్
‘పక్షి విముక్తి పొందింది’ అంటూ మస్క్ ట్వీట్

న్యూయార్క్ : బిలియనీర్ ఎలోన్ మస్క్ ఎట్టకేలకు 44 బిలియన్ డాలర్ల (రూ. 3.37 లక్షల కోట్లు) ట్విట్టర్ డీల్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా సంస్థకు ఆయనే బాస్, మస్క్ ఈ డీల్ ప్రకటన చేసినప్పటి నుంచి గత 7 నెలలుగా అనేక వివాదాలు నడిచాయి. ఆఖరికి ఈ డీల్ గురువారంతో ముగిసింది. మస్క్ ట్విట్టర్ చీఫ్ అయిన వెంటనే భారత సంతతికి చెందిన సిఇఒ పరాగ్ అగర్వాల్‌ను తొలిగించారు. ఆయనతో పాటు లీగల్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను కూడా తొలగించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ వైదొలిగిన తర్వాత గతేడాది నవంబర్‌లో అగర్వాల్(38) సోషల్ మీడియా సంస్థకు సిఇఒగా నియమితులయ్యారు. కానీ కొన్ని నెలలకే ఆయన ఇప్పుడు కంపెనీ నుంచి బయటి వెళ్లాల్సి వచ్చింది. టెస్లా కంపెనీ యజమాని మస్క్, ఒప్పందం పూర్తి అయిన వెంటనే ‘ పక్షి విముక్తి పొందింది’ అంటూ ట్వీట్ చేశాడు.

అంతకుముందు ‘ట్విటర్‌లో ప్రజలు సినిమాలు చూడాలని, వీడియో గేమ్‌లు ఆడాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు. ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, మస్క్ సంస్థ 7,500 మంది ఉద్యోగులలో 75 శాతం, అంటే దాదాపు 5,600 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. ట్విట్టర్ డీల్ సందర్భంగా పెట్టుబడిదారులకు మస్క్ ఈ విషయాన్ని చెప్పారు. అయితే ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్ దానిని ఖండించారు. ఉద్యోగులకు ఇమెయిల్ పంపడం ద్వారా కంపెనీ తొలగింపుల కోసం ఎటువంటి ప్రణాళికలు చేయడం లేదని ఆయన అన్నారు. కాగా శుక్రవారం పరాగ్ అగర్వాల్ 38.7 మిలియన్ డాలర్లు, సెహగల్ 25.4 మిలియన్ డాలర్లు, గద్దే 12.5 మిలియన్ డాలర్లు, పర్సనల్స్ 11.2 మిలియన్ డాలర్లు అందుకున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో ట్విటర్ ప్రకటన విధానం కూడా మారుతుందని మస్క్ గతంలో చెప్పారు. అన్ని వయసుల వినియోగదారులు సినిమాలు చూడగలిగే లేదా వీడియో గేమ్‌లు ఆడగలిగే అత్యుత్తమ ప్రకటనల ప్లాట్‌ఫామ్‌గా ట్విట్టర్ ఉండాలని కోరుకుంటున్నానని మస్క్ అన్నారు. మానవాళికి సహాయం చేయడానికి ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్నానని మస్క్ తెలిపారు.

ఒప్పందం గురించి…

తొలుత ట్విట్టర్‌లో మస్క్ 9.2 శాతం వాటా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ట్విట్టర్ కొనుగోలుకు 43 బిలియన్ డాలర్ల ఆఫర్ చేశాడు. కొన్ని నెలలకే స్పామ్ ఆరోపణలు చేసి డీల్‌ను వద్దనుకున్నారు. కానీ ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది.
అక్టోబర్ 28లోగా ప్రస్తుత నిబంధనలపై ట్విట్టర్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని మస్క్‌ను కోర్టు కోరింది. డీల్ ఖరారు కాగానే గురువారం (అక్టోబర్ 27) ఎలోన్ మస్క్ ఒప్పందంపై సంతకం చేశారు.

అక్టోబర్ 27న ఎలోన్ మస్క్ మొదట తన ట్విట్టర్ హ్యాండిల్ బయోని మార్చాడు. బయోలో చీఫ్ ట్విట్ అని రాశారు. దీని తర్వాత ఆయన ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి సింక్‌తో ప్రవేశంచారు.
శుక్రవారం భారత సంతకికి చెందిన ట్విట్టర్ సిఇఒ పరాగ్ అగర్వాల్, మరో ముగ్గురు ఉన్నతాధికారులను ఆయన తొలగించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News