Friday, November 15, 2024

రూ.1.6 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇంక్, ట్విట్టర్ యజమాని ఎలాన్‌మస్క్ నికర విలువ గురువారం 20.3 బిలియన్ డాలర్లు (రూ.1,66,410 కోట్లు) పడిపోయింది. టెస్లా కంపెనీ షేర్ల పతనం కారణంగా మస్క్ నికర విలువ ఒక్కసారిగా తగ్గింది. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించడాన్ని కొనసాగించాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. టెస్లా ఈ ప్రకటన తర్వాత మస్క్ నికర విలువ 234.4 బిలియన్ డాలర్లకు క్షీణించింది. కంపెనీ స్టాక్ దాదాపు 10 శాతం అంటే 28.36 డాలర్లు పడిపోయి 262.90 డాలర్ల వద్ద ముగిసింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఇప్పటివరకు మస్క్ మొత్తం ఆదాయాలలో 7వ అతిపెద్ద క్షీణత, ఆయన నికర విలువ 20.3 బిలియన్ డాలర్లు తగ్గి 234.4 బిలియన్ డాలర్లకు చేరుకుం ది. అయితే మస్క్ ఇప్పటికీ ఇండెక్స్‌లో నంబర్ వన్‌లో ఉన్నారు. జులై 20న టెస్లా స్టాక్ దాదాపు 10 శాతం 262.90 డాలర్ల వద్ద ముగిసింది. మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ మధ్య సంపద అంతరం కూడా తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News