వాషింగ్టన్: ఎలన్ మస్క్ సంపద గిన్నీస్ రికార్డులోకి ఎక్కేంతగా తరిగిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అతడి సంపద గణనీయంగా తరిగిపోయిందని ‘గిన్నీస్ రికార్డు ఆఫ్ బుక్’ పేర్కొంది. ‘వ్యక్తిగతంగా అతడు పెద్ద ఎత్తున సంపదను కోల్పోయాడు’ అని పేర్కొంది. మస్క్ సంపద 2021లో 320 బిలియన్ డాలర్లు ఉండింది. 2023 నాటికి అది 138 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ముఖ్యంగా టెస్లా స్టాక్ గణనీయంగా పడిపోవడంతో అతడి సంపద కూడా గణనీయంగా తగ్గిపోయింది’ అని ఫోర్బ్ మ్యాగజైన్‌ను పేర్కొంటూ గిన్నీస్ బుక్ రాసింది.
మస్క్‌తోపాటు అతడి తోటి బిలియనీర్లు కూడా గణనీయంగా సంపదను కోల్పోయారు. అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు. కాగా మెటా సిఈవో మార్క్ జుకెర్‌బర్గ్ 78 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు. పెద్ద ఎత్తున నష్టపోవడంలో ఎలన్ మస్క్, జపాన్ మదుపరుడు మసయోషి సన్‌ను కూడా దాటేశాడు. 58.6 బిలియన్ లాస్ గ్యాప్‌తో దాటేశాడు. ఇదివరలో మస్క్ రికార్డు స్థాయిలో 200 బిలియన్‌ల నెట్‌వర్త్‌ను కోల్పోయాడని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచి పేర్కొంది.