Sunday, January 12, 2025

మస్క్ చెప్పినట్లే 26 ఏళ్ల తర్వాత జరిగింది…జరుగుతోంది!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇంటర్నెట్ మీడియాలో విప్లవాత్మక మార్పు తెస్తుంది అని 1998లో చెప్పిన మాటలను నేడు నిజమయ్యాయి.  ఆ నాడు  చెప్పిన విషయం తాలూకు వీడియోను ఆయన ఇప్పుడు ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

1998లో ఓ ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి మస్క్ ను ప్రశ్నించారు. దానికాయన ‘‘ ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్ సెట్ అని నేను భావిస్తున్నాను ’’ అన్నారు. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అన్నారు. అప్పడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారు అంటూ తాజా ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.

అపరిమిత డేటా మాత్రమే కాకుండా, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడానికి వీలుగా ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రాజెక్ట్’ ను ప్రారంభించారు. ఇంటర్నెట్ విషయం మీదనే కాకుండా ఎలన్ మస్క్ కృత్రిమ మేధస్సు(AI) కూడా వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధస్సు ఉద్యోగాలను తగ్గిస్తుందని కూడా అంచనా వేశారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని సేవలను అందిస్తాయని ఆయన అన్నారు. అదంతా నేడు నిజమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News