Friday, January 24, 2025

గ్రహాంతర వాసులున్నట్లు సాక్ష్యాధారాలు ఎన్నడూ చూడలేదు: మస్క్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గ్రహాంతర వాసులు(ఏలియన్స్) ఉన్నారా? అని విజ్ఞానశాస్త్ర ప్రపంచం వెతుకుతుంటే, ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మే 7న లాస్ ఏంజెల్స్ లో జరిగిన 2024 మిల్కెన్ ఇనిస్టిట్యూట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో అబ్బురపోయే విషయాలు చెప్పారు. తాను గ్రహాంతర వాసుల విషయాన్ని నమ్మబోనని చెప్పారు. భూమిని గ్రహాంతర వాసులు సందర్శించారన్న విషయాన్ని కూడా తాను నమ్మబోనని మస్క్ తెలిపారు.

గ్రహాంతర వాసులు లేక మానవేతరులు ఏదేని రోదసి నౌకను నడిపిన సాక్ష్యాధారాలనైతే తానింత వరకు చూడలేదని మస్క్ తెలిపారు.  అంతేకాక ఆయన ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న కృత్రిమ మేధో శక్తి పై కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృత్రిమ మేధతో వాస్తవాలు కనిపెట్టాలే గానీ, అవాస్తవికతలను చెప్పించకూడదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News