Monday, November 25, 2024

మనిషి మెదడులో చిప్

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా : మెదడు చిప్ స్టార్టప్ న్యూరాలింక్ నుంచి ఆదివారం పరికరాన్ని పొందిన తొలి మానవ రోగి బాగా కోలుకుంటున్నట్లు సంస్థ బిలియనీర్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ వెల్లడించారు. ‘కనుగొన్న న్యూరాన్ స్పైక్ బాగా పని చేస్తున్నట్లు తొలి ఫలితాలు సూచిస్తున్నాయి’ అని మస్క్ సోమవారం సామాజిక మీడియా వేదిక ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. స్పైక్‌లు న్యూరాన్‌ల వల్ల పని చేస్తుంటాయి.

మెదడు చుట్టూ, శరీరానికి సమాచారం పంపే విద్యుత్, రసాయన సంకేతాలను ఉపయోగించు కణాలే అవి అని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్) పేర్కొన్నది. మానవుల్లో తన పరికరాన్ని పరీక్షించేందుకు తొలి ప్రయోగం జరపడానికి నిరుడు ఆ సంస్థకు యుఎస్ ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డిఎ) అనుమతి ఇచ్చింది. పక్షవాత రోగులకు సంబంధించి మానవ ప్రయోగానికి రిక్రూట్‌మెంట్ జరపడానికి తమకు అనుమతి లభించిందని న్యూరాలింక్ గత సెప్టెంబర్‌లో తెలియజేసింది. కాగా, న్యూరాలింక్ నుంచి తొలి ఉత్పత్తిని ‘టెలిపతీ’ అని పిలవనున్నట్లు మస్క్ వేరే పోస్ట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News