న్యూయార్క్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోతే… ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను చంపేసే అవకాశం ఎక్కువగా ఉందని టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం రష్యా కొనసాగిస్తుందని, దీంతో పుతిన్‌పై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ఎక్స్ స్సేసెస్ వేదికపై రిపబ్లికన్ల పార్టీ ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదని హితువు పలికారు. యుద్ధం చాలా కాలం పాటు జరిగితే ఉక్రెయిన్‌కే నష్టమని తెలియజేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా తాజా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఆ ఆదేశానికి ఉపయోగం లేదని విమర్శించారు. రష్యాను అణచివేయడానికి తన కంపెనీల కంటే ఎక్కువగా మరే ఏ కంపెనీలు పని చేయలేదన్నారు. స్పేస్‌ఎక్స్ స్టార్టింగ్ సేవలను ఉక్రెయిన్ కు అందిస్తుందని, రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు కీలకమైందన్నారు. దీంతో రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్‌ఎక్స్‌ను దూరంగా ఉంచిందని ఎలాన్ మస్క్ చెప్పారు.
ఈ యుద్ధంలో రెండు వైపులా ప్రాణనష్టాన్ని తగ్గించడమే తన లక్షమని చెప్పారు. రష్యాలో రాబోయే రోజుల్లో పుతిన్ ఓడించిన తరువాత ఆయన స్థానంలో ఎవరు ఉంటారని, ఆయన శాంతికాముకుడిగా ఉంటాడా? అని ప్రశ్నించారు. మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండొచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. తైవాన్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు 9530 కోట్ల డాలర్ల సాయం అందిస్తామని అమెరికా సెనెట్‌లో బిల్లును ఆమోదించారు. 6000 డాలర్లు ఒక్క ఉక్రెయిన్‌కు ఇవ్వడంతో ప్రతిపక్ష రిపబ్లికన్లు తీవ్ర విమర్శలు చేశారు. 22 రిపబ్లికన్లు డెమోక్రాట్లు కలిస రావడంతో సెనెట్‌లో 70-29 ఓట్లతో ఈ బిల్లును నెగ్గారు.