Thursday, January 23, 2025

భారత్‌లో మూతపడ్డ రెండు ట్విట్టర్ కార్యాలయాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ట్విట్టర్ భారత్‌లోని మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసేసింది. పైగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయమని ఆదేశించింది. ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశ్యంతో కంపెనీ యజమాని ఎలన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గత ఏడాది ట్విట్టర్ ఇండియాలో ఉన్న 200కు పైగా సిబ్బందిలో 90 శాతం మందిని తొలగించింది. న్యూఢిల్లీ, ముంబైలోని తన కార్యాలయాలను మూసేసింది. ప్రస్తుతం బెంగళూరు కార్యాలయం ఒక్కటే పనిచేస్తోంది.

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఎలన్ మస్క్ 2023 చివరికల్లా ట్విట్టర్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆభాభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీలు మెటా ప్లాట్‌ఫారమ్ మొదలుకుని అల్ఫాబెట్ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన గూగుల్ వరకు అనేక కంపెనీలు మార్కెట్ అభివృద్ధికి ఇండియానే కీలకంగా భావిస్తుంటాయి. కానీ ఎలన్ మస్క్ మాత్రం ఇండియా మార్కెట్‌కు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇండియాలో ట్విట్టర్‌ను ఉపయోగించే వారు ఎక్కువే ఉన్నప్పటికీ దాని రాబడి చెప్పుకోతగ్గంత లేదు. పైగా అది స్థానికంగా పోటీని ఎదుర్కొనడమేకాక, అనేక నియంత్రణలను ఎదుర్కొంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News