Monday, January 20, 2025

టెస్లా షేర్లను విక్రయించిన ఎలోన్ మస్క్

- Advertisement -
- Advertisement -

elon musk sold tesla shares

9.6 బిలియన్ డాలర్ల విలువ

న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లాకు చెందిన 6.9 బిలియన్ డాలర్ల (రూ.54 వేల కోట్లు) షేర్లను విక్రయించారు. దీనికి కారణం 44 బిలియన్ డాలర్ల (రూ. 3.4 లక్షల కోట్లు) ట్విట్టర్ డీల్, రద్దయిన ఒప్పందాన్ని బలవంతంగా మూసివేస్తే నగదు అవసరం ఉంటుందని మస్క్ అన్నారు. అంతకుముందు ఏప్రిల్‌లో మస్క్ 8.5 బిలియన్ డాలర్ల (రూ. 67 వేల కోట్లు) షేర్లను విక్రయించారు. ఆ సమయంలో ఎక్కువ షేర్లను విక్రయించే ఆలోచన లేదని అన్నారు. అయితే మస్క్ కొత్త ఫైలింగ్ ప్రకారం, ఆగస్టు 5- 9 మధ్య ఆయన 79.2 మిలియన్ విలువ షేర్లను ఆయన విక్రయించారు. ఇప్పుడు అతని వద్ద 15.5 కోట్ల షేర్ మిగిలి ఉంది. మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫేక్, స్పామ్ ఖాతాల సంఖ్యను ట్విట్టర్ ఇంకా వెల్లడించలేదని ఆయన ఆరోపించారు. అయితే డీల్ రద్దవడంతో ట్విట్టర్ మస్క్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించింది. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున జరిగిన డీల్‌ను మస్క్ పూర్తి చేయాలని ట్విట్టర్ కోరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News