- Advertisement -
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన స్టార్‌షిప్ మెగా రాకెట్ విఫలమైంది.. ఇది నిజంగా ఆ సంస్థకు పెద్ద కుదుపు. టెక్సాస్ లోని బొకాచికా వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ఓ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే ఆ రాకెట్ తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా, అంతరిక్షంలో అది పేలిపోయింది. ఈ దృశ్యాలు వీడియోల ద్వారా వైరల్ అవుతున్నాయి. రాకెట్ పేలిపోవడంపై స్పేస్ ఎక్స్ స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం కూడా ఇలాగే వైఫల్యం చెందిందని, వీటినుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక రాకెట్ , బహుమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. ఈ క్రమం లోనే ఎయిర్ ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. గత జనవరి లోనూ స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ విఫలమైంది
- Advertisement -