Sunday, January 19, 2025

44 బిలియన్ డాలర్లకు ‘ట్విట్టర్’ కొనుగోలు చేసిన ఎలన్ మస్క్

- Advertisement -
- Advertisement -
Elon Musk and Twitter
టెక్ ప్రపంచంలోని అతిపెద్ద డీల్స్‌లో ఒకటైన  ట్విట్టర్‌ కొనుగోలును బిలియనీర్ ఎలన్ మస్క్ సాధించారు. మస్క్ ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్ కోసం దాదాపు 44 బిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.

న్యూఢిల్లీ: ఎలన్ మస్క్ చివరికి సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల విలువ కట్టారు. మస్క్ ట్విట్టర్ స్వాధీనంకు సంబంధించి ఏప్రిల్ 14నే ఓ ప్రకటన చేశారు. అదే తన  ‘బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్’ అని కూడా ఖరాఖండిగా తెలిపారు.

” భావస్వేచ్ఛా అనేది ప్రజాస్వామ్యం పనిచేయడానికి పునాది,  ట్విట్టర్ అనేది డిజిటల్ ‘టౌన్ స్క్వేర్’, ఇక్కడ మానవాళి  భవిష్యత్తుకు సంభందించిన కీలకమైన విషయాలు చర్చించబడతాయి. కొత్త ఫీచర్‌లతో ఉత్పత్తిని మెరుగుపరచడం, నమ్మకాన్ని పెంచడానికి అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేయడం, స్పామ్ బాట్‌లను ఓడించడం, మానవులందరిని ప్రామాణీకరించడం ద్వారా నేను ట్విట్టర్‌ని గతంలో కంటే మెరుగ్గా చేయాలనుకుంటున్నాను. ట్విట్టర్‌లో విపరీతమైన సంభావ్యత ఉంది – నేను ఈ కంపెనీ కోసం పనిచేయబోతున్వినాను. వినియోగదారుల సంఘంతో కలిసి దాన్ని అన్‌లాక్ చేయడానికి, కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను ”అని ఒప్పందం ధృవీకరించబడిన తర్వాత మస్క్ తన ట్విట్టర్ ఖాతాకు పోస్ట్ చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News