Friday, December 20, 2024

ట్విట్టర్ డీల్‌కు గుడ్‌బై..!: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

టెక్సాస్: ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.3 లక్షల కోట్లు పైబడిన(44 బిలియన్ డాలర్లు) ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్‌ఇసి) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మస్క్ తరఫు లాయర్లు పేర్కొన్నారు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఫేక్ లేదా స్పామ్ అకౌంట్ల సమాచారం విషయంలో స్పందించాలని పలుమార్లు కోరినా ట్విట్టర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మస్క్ భావిస్తున్నారని, నకిలీ ఖాతాల సమాచారం చాలా ముఖ్యమని మస్క్ భావిస్తున్నారని వివరించారు. డీల్ నిబంధనల ప్రకారం.. తన అనుమతి లేకుండానే ఇద్దరు టాప్ మేనేజర్లను ట్విట్టర్ తొలగించినట్లు ఫైలింగ్‌లో మస్క్ చెప్పారు.
న్యాయపరమైన చర్యలు తప్పువు

ఎలాన్ మస్క్ ప్రకటనపై ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టాయ్‌లో స్పందించారు. కొనుగోలు ఒప్పందానికి కట్టుబడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. మస్క్ అంగీకరించిన రేటు, నిబంధనలను అనుగుణంగా ఒప్పందాన్ని పూర్తి చేయాలని ట్విట్టర్ బోర్డ్ నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇందుకు అనుగుణంగా న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. కాగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే నిబంధనల ప్రకారం ఎలాన్ మస్క్ ఏకంగా 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ట్విట్టర్ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని హామీ లభించని నేపథ్యంలో డీల్‌ని నిలుపుదల చేస్తున్నట్టు మే నెలలోనే ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని అప్పుడు పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ల సమాచారం అందించకపోతే ఒప్పందం నుంచి వైదొలగుతానని జూన్ నెలలో ప్రకటన చేశారు.

Elon Musk Terminates $44 Billion Twitter Deal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News