Friday, December 20, 2024

సెలబ్రిటీలు, ప్రముఖులకు ఎలాన్ మస్క్ భారీ షాక్…

- Advertisement -
- Advertisement -

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వినియోగదారు ప్రొఫైల్‌ల నుండి లెగసీ బ్లూ చెక్‌మార్క్‌లను తీసివేసింది. దీంతో సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. సబ్ స్ర్కిప్షన్ ఛార్జీలు చెల్లించని కారణంగా బ్లూటిక్ తొలగించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, షారూక్, పాప్ గాయని బియాన్సే, పోప్ ఫ్రాన్సిస్, ట్రంప్ ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ తొలగించారు. ఈ విషయాన్ని చాలా మంది ట్విటర్ వినియోగదారులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు.

వినియోగదారుల కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ సబ్‌స్క్రైబర్ ప్రొఫైల్ పక్కన బ్లూ చెక్‌మార్క్‌ను జోడిస్తుంది ట్విట్టర్.  మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పరిచయం చేయబడిన కొత్త ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు వారి ట్విట్టర్ పోస్ట్‌లను 30 నిమిషాలలోపు సవరించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. భారత్ లో iOS, ఆండ్రాయిడ్ వినియోగదారులకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ 900 అయితే వెబ్ వెర్షన్ కోసం రుసుము నెలకు రూ 650గా నిర్ణయిచినట్లు ట్విట్టర్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News