Thursday, January 30, 2025

ఏలూరు యాసిడ్ బాధితురాలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏలూరు యాసిడ్ బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక గత వారం రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలలోకి వెళితే.. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దంత వైద్య కళాశాలలో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న ఫ్రాన్సిక ఏలూరులోని జెవియర్ నగర్ లో నివాసముంటుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఫ్రాన్సిక భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది.

Also Read: పెండింగ్ చలాన్లు..బైక్ కి నిప్పు పెట్టిన యువకుడు

గత మంగళవారం రాత్రి డ్యూటికి వెళ్లి బైక్ పై తిరిగి ఇంటికి వెళ్లున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ఆమెపై యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తల, ముఖానికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు , కుటుంబ సభ్యులు చికిత్ప నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఫ్రాన్సిక బుధవారం ఉదయం చనిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News