Tuesday, December 24, 2024

నగ్నంగా నిలబెట్టి…. మర్మాంగాన్ని కటింగ్ ప్లేయర్ తో నొక్కి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: కోళ్లు దొంగతనం చేశారనే నేపంతో ఓ దళిత బాలుడిపై దాడి చేసి నగ్నంగా నిలబెట్టి మర్మాంగాన్ని కటింగ్ ప్లేయర్‌తో నొక్కిపెట్టి హింసించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురేష్, రాంబాబు, ధర్మారావు, అప్పారావు, రాకేశ్, శేఖర్, సిద్ధిరాజు, దుర్గారావులు పని ఉందని చెప్పి దళిత బాలుడిని కోళ్లఫారమ్ దగ్గరికి తీసుకెళ్లారు. తన కోళ్లను దొంగతనం చేస్తున్నావని బాలుడిపై దాడి చేశారు. బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. తన చేతిలో చచ్చిపోతావ్ అని బాలుడిని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారు.

Also Read: ఐఫోన్ కోసం 8 నెలల పసిబిడ్డ అమ్మకం

బాలుడి మర్మాంగాలను కటింగ్ ప్లేయర్‌తో నొక్కి పెట్టి ఇబ్బందికి గురి చేశారు. బాలుడి వారి బారి నుంచి తప్పించుకొని జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. కొట్టిన గాయాలు అని తేలడంతో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కింద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. కేసు నుంచి ముగ్గురిని తప్పించేందుకు వైసిపి నాయకులు విఫలయత్నం చేశారు. బాలుడి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కేసు పోలీసులు నమోదు చేశారు. నిందితులు వైసిపికి చెందిన కార్యకర్తలు అని గ్రామస్థులు వాపోయారు. రోజు రోజుకు వైసిపి నాయకులు అవినీతి, అన్యాయాలు, దాడులకు తెగబడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News