Wednesday, January 22, 2025

విషపు నిషాల రేవ్ పార్టీ.. ఐదుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

నోయిడా : నాగుపాము విషంతో రేవ్‌పార్టీ హంగామా సంచలనానికి దారితీసింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ విషపు విందుకు సంబంధించి బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్‌పై కూడా కేసు నమోదు అయినట్లు నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 51లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ రేవ్‌పార్టీకి ఏర్పాట్లు చేసిన ఐదుగురి వద్ద నుంచి తొమ్మిది పాములు స్వాధీనం చేసుకుని, వాటిని వన్యప్రాణి సంస్థలకు అప్పగించారు. రేవ్‌పార్టీలలో పాములు, పాముల విషాలను వాడటం ఇటీవలి కాలంలో ఓ విపరీత తంతు అయింది. పార్టీలో గొప్పతనం కోసం ఈ విధంగా కొందరు చేస్తున్నారు. దీనిని గుర్తించి ముందుగా జంతు హక్కుల బృందం ఒకటి రంగంలోకి దిగింది. ఈ పార్టీపై వలపన్ని పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు. ఈ బ్యాంకెట్ హాల్ వారు పార్టీలకు విషాన్ని సరఫరా చేస్తున్నట్లు నిర్థారణ అయింది. గురువారం రాత్రి ఈ వీనమ్ విందు జరుగుతూ ఉండగా పట్టుకున్నారు.ఇప్పుడు అరెస్టు అయిన వారిలో రాహుల్, తీతూనాథ్, జైకిరణ్, నారాయణ్, రవీనాథ్ ఉన్నట్లు గుర్తించారు.

వీరంతా ఢిల్లీలోని బదార్‌పూర్ ప్రాంతానికి చెందిన మోహర్‌బంద్ గ్రామం వారని పోలీసులు తెలిపారు. బిజెపి ఎంపి మేనకా గాంధీ ఆధ్వర్యంలోని జంతురక్షణ సంస్థ పిఎఫ్‌ఎ వీరిపై ఫిర్యాదుకు దిగింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తరచూ పాములతో వీడియోలు చేయడం, విషంతో కూడా రకరకాల విన్యాసాలకు దిగడం జరుగుతోందని పిఎఫ్‌ఎకు చెందిన గౌరవ్ గుప్తా తెలిపారు. ఎల్విష్ బిగ్‌బాస్ హిందీ ఓటిటి సీజన్ 2 విజేతగా కూడా ఉన్నారు. ఆయన తన సన్నిహితులు కొందరితో కలిసి వింతైన అరుదైన పార్టీలు నిర్వహిస్తూ బాగా డబ్బులు గడిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఎల్విష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కాగా తాను నిర్దోషిని అని , తనపై ఆరోపణల్లో సున్నా శాతం కూడా నిజం లేదని, తాను పోలీసు వర్గాలకు పూర్తిగా సహకరిస్తానని ఎల్విష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. వీనమ్ పార్టీలలో కొందరు కొద్ది మోతాదులో కిక్ కోసం విషం తీసుకుంటారని, ప్రత్యేకించి యువత ఎక్కువగా హాజరయ్యే ఈ పార్టీల వెనుక లక్షలాది రూపాయలు చేతులుమారుతాయని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News