Monday, December 23, 2024

మొక్కలు నాటిన ‘ఏం చేస్తున్నావ్’ మూవీ టీమ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ఏం చేస్తున్నావ్ మూవీ’ లాంచ్ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ‘ఏం చేస్తున్నావ్’ మూవీ టీమ్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా నటి అమిత రంగనాత్ , నటులు విజయ్ రాజకుమార్ మాట్లాడుతు రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. నేటి తరాలకు సంతోష్ చేస్తున్న సేవ ఎంతో గొప్పదన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని అది మన భాద్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన ఎంపి సంతోష్‌కు చిత్ర బృందం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భరత్ మిత్ర, రామ్, ప్రేమ్ అడవి, హేమంత్ రామ్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News