Thursday, January 16, 2025

ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ ను ప్రారంభించిన ఇమామి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పురుషులకు ముఖ, చర్మ సౌందర్యానికి అత్యద్భుతమైన బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్. ఈ ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ బ్రాండ్ ఇమామి వారిది. ఇప్పుడు ఇమామి లిమిటెడ్ తన ఐకానిక్ మెన్స్ బ్రాండ్ అయినటువంటి ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ కు సరికొత్త గుర్తింపుని ఇచ్చేందుకు ఈ ఉత్పత్తిని స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బాలీవుడ్ హార్డ్ త్రోబ్ కార్తీక ఆర్యన్ ఇప్పుడు దీనికి కొత్త అంబాసిడర్ గా మారాడు. ఈ కీలకమైన మార్పు చాలా సాహసోపేతమైన ముందడుగును సూచిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా పురుషుల సౌందర్య సాధనాల మార్కెట్లో బ్రాండ్ యొక్క నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా మరింత సమగ్రమైన సౌందర్య పద్ధతుల వైపు సాంస్కృతిక మార్పును ఇది స్వీకరించింది. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలతో, నేటి యువకులు చర్మ ఆరోగ్యానికి, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ ఇప్పుడు వారి అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇక బ్రాండ్ కు సంబంధించిన కొత్త పొజిషనింగ్ స్టేట్‌మెంట్ ఏంటంటే, “హర్ రోజ్ హ్యాండ్సమ్ కోడ్”. పురుషులకు విశ్వాసం, వ్యక్తిత్వం రెండింటినీ మెరుగుపరిచే సౌందర్య పరిష్కారాలను అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను ఈ స్టేట్ మెంట్ సంగ్రహిస్తుంది. ఇది అందంగా కన్పించడం కోసమే కాదు వారిపై వారికి నమ్మకం ఏర్పడేలా చేస్తుంది. ఈ సరికొత్త గుర్తింపు పురుషుల సౌందర్య బ్రాండ్ యొక్క సమగ్ర విధానాన్ని నొక్కి చెబుతుంది. ముఖం, శరీరం, జుట్టు సంరక్షణ కోసం సమర్థవంతమైన పరిష్కారాలను అందిస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేని రీబ్రాండింగ్ మార్పు కోసం, కొత్త ప్యాకేజింగ్ ప్రముఖంగా “ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఇప్పుడు స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్” అనే మేసేజ్ ను కలిగి ఉంటుంది. ఇది వినియోగదారులతో పరిచయాన్ని, నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్రాండ్ ను సరికొత్తగా వినియోగదారుల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ప్రయాణం మరింత వేగవంతం అయ్యేందుకు Gen-Z సూపర్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ను స్మార్ట్, హ్యాండ్ సమ్ యొక్క బ్రాండ్ ఆంబాసిడర్ గా తీసుకున్నారు.

పురుషులను ఉత్తమంగా కనిపించేలా, అనుభూతి చెందేలా ప్రోత్సహించే బ్రాండ్ యొక్క నైతికతను కలిగి ఉన్నాడు. పట్టణ, అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో యువతే లక్ష్యంగా కార్తీక ఆర్యన్ తమ బ్రాండ్ కనెక్షన్‌ను మరింత బలోపేతం చేయగలరని భావిస్తున్నారు. “నేటి డైనమిక్ యువతరం కోసం మేము విస్తృతమైన సౌందర్య అవసరాలను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన అవకాశం కోసం చూస్తున్నాము. ఫెయిర్ అండ్ హ్యాండ్ సమ్ నుండి స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ కు రీబ్రాండింగ్ అనేది వినియోగదారుల ఇన్ సైట్స్ ద్వారా నడిచే వ్యూహాత్మక నిర్ణయం. ఇది వ్యక్తిత్వం, వైవిధ్యం మరియు విశ్వాసం వైపు దృష్టి సారిస్తుంది. నేటి యువకులలో సహజమైన చర్మ ఆరోగ్యం అనేక లేటెస్ట్ ఉత్పత్తి ఫార్మాట్‌లకు ఎక్కువగా అందుబాటులో ఉంది. ఇప్పుడు బాలీవుడ్ హార్ట్ త్రోబ్ కార్తీక్ ఆర్యన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం వల్ల ఈ రిఫ్రెష్ గుర్తింపును స్మార్ట్ అండ్ హ్యాండ్‌సమ్‌గా అందించగలదని మేము విశ్వసిస్తున్నాము. అభివృద్ధి చెందుతున్న పురుష గ్రూమింగ్ మార్కెట్‌లో మా నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయడం కోసం మేం సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు ఇమామి లిమిటెడ్ వైస్ చైర్మన్, హోల్‌టైమ్ డైరెక్టర్ మోహన్ గోయెంకా.

ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కూడా మాట్లాడాడు. “నేను స్మార్ట్ అండ్ హ్యాండ్ సమ్ యొక్క ఫేస్ గా ఇమామి కుటుంబంలో చేరినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. ఈ రోజు గ్రూమింగ్ చర్మ సౌందర్యానికి అతీతమైనది. విశ్వాసం, వ్యక్తిత్వం మరియు స్వీయ-వ్యక్తీకరణను మరింత ఇనుమడింపచేస్తుంది. బ్రాండ్ యొక్క గ్రూమింగ్ నాతో మరింతగా ప్రతిధ్వనిస్తుంది. లేటెస్ట్ యువకులకు సమర్ధవంతమైన పరిష్కారాలను అందిస్తోంది. ఈ ఎక్స్ సైటింగ్ ప్రయాణంలో భాగం కావాలని ఎదురుచూస్తున్నాను.” అని అన్నారు ఆయన.

రీబ్రాండ్ చేయాలనే ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పటినుంచి ప్రస్తుత లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్లుగా, అలాగే వినియోగదారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం కోరుకుంటున్నారో లాంటి విషయాల్ని మరింత లోతుగా కనుక్కునేందుకు ఇమామి ప్రయత్నించింది. ఇవాళ్టి రోజున యువకులు హైడ్రేషన్, ఆయిల్ కంట్రోల్, గ్రూమింగ్ సమస్యలను పరిష్కరించే ఉత్పత్తుల కోసం చూస్తున్నారని మాకు అర్థమైంది.

2024లో భారతదేశపు పురుష గ్రూమింగ్ మార్కెట్ రూ.18,000 కోట్లుగా అంచనా వేయబడినందున, ఈ మార్పు మారుతున్న ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ పురుషులు తమ విశ్వాసాన్ని పెంచే ఉత్పత్తులపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. కార్తీక్ ఆర్యన్ నటించిన రీబ్రాండింగ్ అడ్వర్టైజ్ మెంట్ జనవరి నెల మధ్య నుంచి ప్రారంభమవుతుంది. టెలివిజన్, డిజిటల్ మరియు సోషల్ మీడియా యాక్టివేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ ఉత్తేజకరమైన మార్పు సమయంలో వినియోగదారుల గుర్తింపు, విధేయతను నిర్ధారించడానికి రిఫ్రెష్ చేయబడిన ప్యాకేజింగ్ ఒక వంతెనగా పనిచేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News