Monday, January 20, 2025

దేశ చరిత్రను మార్చేందుకు బిఆర్‌ఎస్ ఆవిర్భావం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల: తెలంగాణ రాష్ట్ర సం క్షేమ పథకాలను అభివృద్ది కార్యక్రమాలను దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు చేసి ప్రపంచ దేశానికి భారతదేశం దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ ఆవిర్భావం చేశాడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం చేర్యాలలో గాంధి చౌరస్తా వద్ద ఇటీవల రే వంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యా ఖ్యలను ఖండిస్తూ దిష్టిబోమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏ ర్పడిన నాటి నుండి రైతులు సుభిక్షంగా ఉన్నారని ఎ లాంటి బాదలు రాకుండా సిఎం కెసిఆర్ రైతుల ప క్షపాతిగా వ్యవహరిస్తున్నాడని అన్నారు.

24 గం టల ఉచిత కరెంట్ , రైతుబీమా, రైతుబంధు తదితర పథకాలను తీసుకొచ్చి రైతులను రాజుచేయడమే ల క్షంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తుంటే ఓర్వేలేని కాం గ్రెస్ నాయకులు రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎందుకని అడ్డుపడుతున్నారని దానిలో బాగంగానే ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకని మూడు గం టల కరెంట్ ఇస్తే సరిపోదా అని అనడం విడ్డూరమని రైతు బీమా, రైతుబంధు రైతులకు ఎందుకని వాటిని ఇవ్వోద్దని అంటున్నాడన్నారు. తెలంగాణ రై తులు సుఖసంతోషాలతో బతుకుడు రేవంత్‌రెడ్డికి ఇ ష్టం లేదని తెలంగాణ రైతాంగం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తిప్పుకొడుతున్నారని ఖబర్ధార్ రేవంత్ రెడ్డి అని ప్రతి ఊరు వాడ రైతన్నలు ఆవేశానికి గురవుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు బాగుపడ్డ దాఖలాలు లేవని వచ్చిపోయే కరెంటు కష్టాలతో రాత్రులు బావి వద్దకు వెళ్లి మోటర్లు పెట్టే దుస్థితి వచ్చిందని ఆ దుస్థితిలో రాత్రి పాము, తేలు కాటుకు గురై ఎందరో రైతన్నలు నెలకొరిగారని స్పష్టం చేశారు. వచ్చిపోయే కరంట్‌తో ట్రాన్స్‌ఫార్మ్‌ల్రు బావి మోటర్లు కాలిపోయే పరిస్థితి ఉండేదని రైతులకు నకిలీ విత్తనాల బాధ, ఎరువుల బాధ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ ఉండేదని ఆనాడు నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయి ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్న దాఖాలాలు ఉన్నాయని తెలిపారు. నేడు బిఆర్‌ఎస్ హయాంలో నకిలీ విత్తనాలు అమ్మితే పిడియాక్డ్ కింద కేసులునమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అంకుగారి స్వరూపరాణి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెడతల ఎల్లారెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూర్మా వెంకట్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్ మంగోల్ చంటి, ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీష్, యూత్ అధ్యక్షుడు శివగారారిఅంజయ్య, ఆకుల రాజేశ్ గౌడ్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News