Monday, December 23, 2024

రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర అని, ఆ చరిత్రలో రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ విద్యార్థులు, యువత, అమరవీరులు కలలుగన్న సమసమాజం రావాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది.

ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు నెల్లూరి దుర్గాప్రసాద్, సూర్యదేవరలత, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సాయి తులసి, పెద్దోజు రవీంద్రాచారి, మూతినేని సైదేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపి నాయకుల బృందం అసెంబ్లీ ఎదుట గన్ రాక్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామ భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దుర్గాప్రసాద్, ముప్పిడి గోపాల్, డాక్టర్ ఏ ఎస్ రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.షకీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News