Wednesday, November 13, 2024

ఫ్లాష్ ఫ్లాష్.. ఫోన్లలో మోగిన అలర్ట్ బెల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా దేశంలోని పలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు ఉన్నట్లుండి ‘ ఎమర్జెన్సీ అలర్ట్ ’ కాల్ చప్పుళ్లు అదేపనిగా వస్తున్నాయి. గురువారం అత్యధిక సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలలోని సెల్‌ఫోన్‌వాలాలకు ఈ అలర్ట్ కాల్ రావడం, ఇది తిరిగి బటన్ నొక్కేవరకూ మోగుతూ సాగడంతో పలువురు కంగుతిన్నారు. దేశంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సామాన్యులను ఫోన్ల ద్వారా హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) ఆలోచనల మేరకు భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా ఈ ఎమర్జెన్సీ అలారం సిస్టమ్‌ను రూపొందించారు. దీని పనితీరును పరీక్షించేందుకు ఈ మధ్యకాలంలో ఇది మోగేలా చేస్తున్నారని , దీని పనితీరు పరీక్ష నమూనా అని,

ఈ తరహా అలారం సందేశాన్ని పట్టించుకోవద్దని, సంబంధిత టెస్ట్ ఎన్ ఇండియా వ్యవస్థకు పంపిస్తున్న నమూనా అలర్ట్ అని , దేశ వ్యాప్తంగా అలర్ట్ సంకేతాల పనితీరును పరీక్షించుకోవడం అని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ సంస్థ ప్రకటన వెలువరించింది. గురువారం ఉదయం 11 గంటల 41 నిమిషాల ప్రాంతంలతో ఫ్లాష్‌తో కూడిన అలారం మోతలు రావడం, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అనే సందేశం కూడా రావడంతో జనం కంగుతిన్నారు. ప్రజలకు అత్యవసరంగా భూకంపాలు, సునామీలు , ఆకస్మిక వరదల దశలో అందించే సంకేతం ఇదని కేంద్రం వివరణ ఇచ్చుకుంది. త్వరలో సమగ్రరీతిలో రూపొందే ఈ అలారం సిస్టమ్‌కు ఇది సన్నాహాక యత్నం అని తెలిపారు. జులై, ఆగస్టులలో కూడా ప్రజలకు ఈ అలర్ట్ మెస్సెజ్‌లు అందాయి.

కెటిఆర్‌కూ అందిన అలర్ట్ మెస్సెజ్
హైదరాబాద్‌లో గురువారం ఉదయం పలు ప్రజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ఫోన్‌కు కూడా కేంద్ర టెలికాం నమూనాత్మక అలర్ట్ సందేశం అదేపనిగా మోగుతూ అందింది. ఫోన్ ఫ్లాష్‌తో తేరుకున్న కెటిఆర్ దీని పూర్వాపరాలు గమనించి సభికులకు ఈ విషయం తెలిపారు. ఇండ్ల పంపిణీ వంటి మంచి కార్యక్రమంలో ఉన్నామని , ఇతరులకు కూడా ఎమర్జెన్సీ అలర్ట్ అంది ఉంటుందని, ఎవరూ కంగారు పడవద్దని, ఇది అత్యవసర పరిస్థితిని తెలిపే ఫోన్ అలర్ట్ అని భావించండి అని , మనను ఎవరూ భయపెట్టలేరని నవ్వుతూ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News