Friday, December 20, 2024

‘కొన్ని కట్స్‌తో ఎమర్జన్సీ’ విడుదల చేసుకోవచ్చు

- Advertisement -
- Advertisement -

సెన్సార్ బోర్డ్ (సిబిఎఫ్‌సి) రివిజన్ కమిటీ సిఫార్స్ చేసే ‘కొన్ని కట్స్’తో నటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్ కొత్త చిత్రం ‘ఎమర్జన్సీ’ని విడుదల చేసుకోవచ్చునని గురువారం మధ్యాహ్నం బొంబాయి హైకోర్టుకు బోర్డు సూచించింది. ఆ చిత్రాన్ని ఈ నెల 6న విడుదల చేయవలసి ఉన్నది. కానీ, చారిత్రక అసంబంద్ధతల గురించి, సిక్కు సమాజాన్ని తప్పుగా చిత్రించడం గురించి ఫిర్యాదులు రావడంతో చిత్రం విడుదలకు అవరోధం ఏర్పడింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జన్సీ ఆధారంగా చిత్రం నిర్మితమైంది. ‘కొన్ని సున్నిత అంశాలు ఉన్నాయి’ అని, ‘మతపరమైన మనోభావాలు దెబ్బ తినరాదు’ అని ప్రభుత్వ వర్గాలు ‘ఎన్‌డి టివి’తో చెప్పాయి. చిత్రం విడుదల కోరుతూ సహ నిర్మాతలు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారిస్తున్నది.

కోర్టు చిత్రంపై ఒక నిర్ణయం తీసుకోవలసిందని సిబిఎఫ్‌సిని ఆదేశించింది. చిత్రం రేటింగ్‌ల సంస్థ అభ్యంతరాలను అంగీకరిస్తూనే కోర్టు ‘చిత్రంశాంతి భద్రతలను ప్రభావితం చేస్తుందా అనేది నిర్ణయించడం సిబిఎఫ్‌సి బాధ్యత కాదు’ అని పేర్కొన్నది. ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బిపి కొలాబ్‌వాలా ఈ చిత్రం డాక్యుమెంటరీ కాదని అన్నారు, ‘ఒక చిత్రంలో ప్రతి అంశాన్ని జనం నమ్మేంత అమాయకులని మీరు భావిస్తున్నారా? సృజనాత్మక స్వేచ్ఛ సంగతి ఏమిటి?’ అని ఆయన అన్నారు. సిబిఎఫ్‌సి ‘మీనమేషాలు లెక్కించరాదు’ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ‘ఒక నిర్ణయం తీసుకోండి. రివైజింగ్ కమిటీ ఏమంటుందో చూద్దాం. విడుదలకు నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది చూద్దాం. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి’ అని కోర్టు పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News