- Advertisement -
బెంగళూరు : సాంకేతిక లోపం కారణంగా భారత శిక్షణ విమానం కర్ణాటక లోని బెలగావి వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రికి తరలించారు. శిక్షణ విమానం పైలట్, ట్రైనీ పైలట్‌తో కలిసి మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెలగావి లోని సాంబ్రా విమానాశ్రయం నుంచి బయలు దేరింది.
మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెలగావి లోని హోన్నిహాల గ్రామం వద్ద పొలంలో దిగింది. ఈ సమాచారం తెలిసి ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, శిక్షణ పాఠశాల అధికారులు , అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
- Advertisement -