Thursday, January 23, 2025

గాంధీ ఆస్పత్రిలో సరికొత్త నిరంతర సేవలు

- Advertisement -
- Advertisement -

Coronavirus Cases Rise in Greater Hyderabad

 

హైదరాబాద్: అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు గాంధీ ఆస్పత్రిలో మరో ప్రత్యేక విభాగం అందుబాటులోకి రానుంది. ఎమర్జెన్సీ మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఈఎండీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ విభాగంలో ఆర్థో, అనస్తీషియా, గ్యాస్ర్టో, న్యూరో, యూరాలజీ, ట్రామా.. ఇలా ముఖ్యమైన విభాగాల వైద్యులు అందుబాటులో ఉంటారు.  ఈఎండీని మే ఒకటిన ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని క్యాజువాలిటీ వార్డుకు తీసుకొస్తే ఆర్థో, అనస్తీషియా వైద్యులకు ఫోన్‌ చేసి పిలిపించే వారు. దీంతో వైద్యం అందడంలో జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితులు లేకుండా అన్ని విభాగాలకు చెందిన వైద్యులు ఈఎండీలో అందుబాటులో ఉంటారు. క్షణాల్లో అన్ని రకాల చికిత్సలూ ఇక్కడ లభిస్తాయి. ఈఎండీ విభాగంలో కార్పొరేట్‌ తరహాలో సేవలు అందుతాయని, 24/7 అన్ని విభాగాలకు చెందిన వైద్యులూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News