హైదరాబాద్ : నగరంలో అతిపెద్ద మెట్రో రైల్ జంక్షన్ అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రత్యేక క్లీనిక్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి నిర్వహకులు పేర్కొన్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్, టెలిమెడిసిన్ సర్వీసెన్‌గా వ్యవహరించనున్న ఈక్లీనిక్‌లో అస్వస్థతకు గురైన మెట్రో ప్రయాణీకులకు అత్యవసర సేవలు అందించనున్నట్లు ఆసుపత్రి హెడ్ డా. కళ్యాణ్ మురమళ్ల తెలిపారు. వైద్య సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటలవరకు అందిస్తామని చెప్పారు.
శుక్రవారం సుధీర్ చిప్లూంకర్ వైస్ ప్రెసిడెంట్ మెట్రో రైల్ లిమిటెడ్, సంజయ్‌పులిపాక ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రికి సిఎస్‌ఆర్ విభాగం ఆస్టర్ వాలంటీర్స్ ద్వారా ఒక రోజు ఉచిత ఆరోగ్య శిభిరాన్ని నిర్వహించారు. ఈశిబిరంలో ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రికి చెందిన వైద్యులు డా. స్వాతి నేతృత్వంలో ఉచిత వైద్యపరీక్షలు, కన్సల్టేషన్ అందించినట్లు పేర్కొన్నారు. డా. గోపాలకృష్ణ ద్వారా ఫిజియోథెరపి సంబంధిత సూచనలు అందజేసినట్లు, సుమారు 100మందికిపైగా ప్రయాణీకులు ఈక్యాంపులో సేవలు పొందినట్లు వెల్లడించారు.